|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 04:08 PM
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడి క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అయితే, బుధవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బ్యారెల్ ధర 95 డాలర్లకు పడిపోవడంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం సామాన్యులకు కొంత ఊరట కలిగించవచ్చు.
Latest News