|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 02:06 PM
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నేపాల్‌లో ఇంధన ధరలు వరుసగా నాలుగోసారి పెరిగాయి. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంపుతో నేపాల్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.216.50కు, డీజిల్ ధర రూ.204.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడమే దీనికి కారణమని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. చమురు దిగుమతులపై వ్యయం పెరగడంతో ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత రెండు నెలల్లోనే నాలుగు సార్లు ధరలు పెరగడం ప్రజలపై భారంగా మారింది.
Latest News