|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 02:18 PM
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. సుపారి గ్యాంగ్‌తో హత్య చేయించి, దొంగతనంగా చిత్రీకరించేందుకు మహిళ విఫల ప్రయత్నం. మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లాలో నివసిస్తూ తన భార్య ప్రియాంక పురోహిత్(25)తో కలిసి ఉంటున్న దేవకృష్ణ(28) అనే వ్యక్తి. ఈ నెల 7వ తేదీన రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, దేవకృష్ణపై దాడి చేసి హతమార్చిన దుండగులు. ఎవరో దొంగతనానికి వచ్చి తనను కట్టేసి, తన భర్తను చంపి, ఇంట్లో ఉన్న నగదు, నగలు ఎత్తుకెళ్లారని కన్నీరు పెట్టుకుని, దొంగతనంగా అందరిని నమ్మించిన ప్రియాంక. ప్రియాంక మాటల్లో పొంతన లేకపోవడంతో, ఆమె కాల్ డేటాను పరిశీలించగా, కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. దీంతో పోలీసుల విచారణలో సురేంద్ర భాటియా అనే వ్యక్తికి సుపారి ఇచ్చి, దేవకృష్ణను తామే హత్య చేసినట్లు అంగీకరించిన కమలేష్, ప్రియాంక. తన భర్త నల్లగా ఉన్నాడని, తన స్థాయికి అతను సరిపోడని, ఈ క్రమంలో కమలేష్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం బయటపడడంతో, అడ్డు తొలగించుకునేందుకు భర్తను హతమార్చినట్లు గుర్తించి నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
Latest News