|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 10:35 AM
రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజున 66 మండలాల్లో తీవ్ర వడగాలులు, 79 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
Latest News