|
|
by Suryaa Desk | Sat, Apr 11, 2026, 02:47 PM
ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. మద్యం తాగడం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో తాగితే మద్యం త్వరగా రక్తంలో కలిసి మత్తు, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత తాగితే మద్యం గ్రహించడం 75% వరకు తగ్గుతుంది. మద్యం తాగే ముందు ఏదైనా ఆహారం తీసుకోవడం, నెమ్మదిగా తాగడం, అసౌకర్యం అనిపిస్తే ఆపేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
Latest News