|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 10:36 AM
AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నిన్న రాత్రి కారులో ప్రయాణిస్తున్న యాత్రికులు చిరుతను చూశారు. డివైడర్ పై కూర్చున్న చిరుతపులిని యాత్రికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఎండల తీవ్రత కారణంగా జంతువులు రాత్రి వేళల్లో నీటి కోసం బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. మొన్న సాక్షి గణపతి వద్ద ఎలుగుబంటి కనిపించింది. రాత్రి వేళల్లో ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని ఈఓ శ్రీనివాసరావు సూచించారు.
Latest News