|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 12:45 PM
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఒంగోలు రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అద్దంకి నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. కొప్పెరపాడుకు చెందిన దేవ కుమారి అనే ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. మొత్తం 31 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. గాయపడిన మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Latest News