|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 02:21 PM
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించి, ప్రజా సమస్యలను అర్జీదారులు సంతృప్తి చెందేలా సమర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పిటిషనర్లకు ఇచ్చే సమాధానాలు స్పష్టంగా ఉండాలని, సమస్య పరిష్కారం సాధ్యంకాకపోతే కారణాలను వివరంగా తెలియజేయాలని సూచించారు.
Latest News