|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 02:51 PM
కర్నూలు జిల్లాలో మెప్మా ఆర్పీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా ఎలా పని చేయిస్తున్నారని జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సీఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఒక నెల వేతనం ఆలస్యం అయితే ఒక విషయం కానీ, ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పని చేయించడం సమంజసం కాదని మెప్మా పీడీని ప్రశ్నించారు. వేతనాలు చెల్లించకపోతే ఆర్పీలతో పనులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ, సమస్యపై వెంటనే నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపాలని ఆదేశించారు.
Latest News