|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 04:01 PM
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. సోమవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జాబ్ మేళా పోస్టర్లను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆవిష్కరించారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా వివిధ 11 ప్రైవేట్ కంపెనీల్లో ఉన్న 650 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ఏప్రిల్ 21న ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మిగనూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించబడుతుంది.
Latest News