|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 12:57 PM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ఘన నివాళులు అర్పించారు. పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారని లోకేష్ కొనియాడారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందామని మంత్రి తెలిపారు.
Latest News