|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 03:01 PM
శ్రీశైలం మండలంలోని స్టోర్ సెంటర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు వేషపోగు కమలాకర్ మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు యువత విద్యావంతులు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి తాళ్లూరి ప్రసన్న బాబు అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, బహుజన రాజ్యం సాధనకు ఐక్యత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News