|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 04:11 PM
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ గుప్తా మంగళవారం కర్నూలు మెడికల్ కాలేజీలో రూ. 66 లక్షల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వి. ఆర్. డి. ఎల్ ల్యాబ్ భవనాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఇప్పటికే మంచి సేవలందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Latest News