|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:17 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో భార్యపై భర్త కత్తితో దాడిచేసి గొంతు కోసిన ఘటన చోటుచేసుకుంది. రాజీవ్‌కాలనీకి చెందిన రాజేశ్, తేజస్విణి 14 ఏళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతో, రాజేశ్ మంగళవారం తేజస్విణి పనిచేస్తున్న బిర్యానీ సెంటర్ వద్దకు వెళ్లి గొడవపడి, కత్తితో ఆమె గొంతు కోశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపై కూడా దాడి చేశాడు. పోలీసులు గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, వారికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడు రాజేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Latest News