|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 12:19 PM
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తొందరపాటు వెనుకగల వ్యూహం ఏమిటని సమాజ్‌వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ప్రశ్నించారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేటప్పుడు, ముందుగా జనగణన, ఆ తర్వాత పునర్విభజన చేపడతామని కేంద్రం చెప్పిందని ఆమె గుర్తుచేశారు. జనగణన జరగకుండానే పునర్విభజనకు కేంద్రం ఎందుకు తహతహలాడుతుందో అర్థం కావడంలేదన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కారు పునర్విభజనకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు.
Latest News