|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 02:15 PM
ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో దళితులకు, అగ్రవర్ణాలకు వేర్వేరు న్యాయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సత్యవేడు నియోజకవర్గానికి గంగా ప్రసాద్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని, లేదంటే గౌరవం లేని పదవి తమకెందుకు అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఎమ్మెల్యే ఎన్నికలకు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని, సత్యవేడు నుంచి గ్రావెల్, ఇసుక అక్రమంగా తమిళనాడుకు తరలిపోతున్నాయని ఆరోపించారు.
Latest News