|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 10:21 AM
AP: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు, కేతు పూజల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రయోగాత్మకంగా రూ.100కు రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు అందుబాటులోనికి తీసుకురానున్నారు. దక్షిణమూర్తి అభిషేకం టికెట్ ఒకరికి రూ.500గా నిర్ణయించారు. రూ.750, రూ.1,500, రూ.2,500 పూజలు యథావిధిగా జరగనున్నాయి. రూ.5 వేల పూజలను రూ.6 వేలకు పెంచారు.
Latest News