|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 11:48 AM
AP: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌పై జనసైనికుడు రవి కిరణ్ రాష్ట్రపతికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లంచాలు తీసుకొని అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన అనుచరులు తోట గోపీ, అతని కుమారుడు రాజా కలిసి భూదాన్ భూములపై అక్రమ వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను భారీ లంచాలు తీసుకొని పరిష్కరించడం వంటి అనేక అక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Latest News