|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 03:14 PM
మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన మరో రెండు బిల్లులపై నేడు పార్లమెంట్‌లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. "మీ ఇంట్లోని తల్లి, సోదరీమణి, కుమార్తె, భార్యను మనసులో తలచుకుని, మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి. మహిళా శక్తికి సేవచేయడానికి, వారిని గౌరవించేందుకు ఇదొక అద్భుత అవకాశం. మహిళల కొత్త అవకాశాలను దూరం చేయొద్దు" అని పేర్కొన్నారు.
Latest News