|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 11:22 AM
యూరోప్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన బోర్డర్ కంట్రోల్ సిస్టమ్‌తో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పాస్‌పోర్టు స్టాంపింగ్‌కు బదులు బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయాల్సి రావడంతో చెకింగ్ ఆలస్యమైంది. ఇటలీలోని మిలన్ నుంచి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు వెళ్లే విమానంలో 156 మంది ప్రయాణికులకు గాను 120 మందికి పైగా బోర్డింగ్ గేట్‌కు చేరుకోలేక ఫ్లైట్‌ను మిస్ అయ్యారు. కొత్త పద్ధతుల్లో చెకింగ్‌తో గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చిందని, కొందరు అస్వస్థతకు గురయ్యారని ప్రయాణికులు వాపోయారు. భద్రతా కారణాల రీత్యా విమానం బయల్దేరాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
Latest News