|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 11:54 AM
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం నాడు రాష్ట్రంలోని 32 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎనిమిది జిల్లాలపై ద్రోణి ప్రభావం చూపనుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి.
Latest News