|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 03:02 PM
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారంపై ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. మార్చి 15 నుంచి ఇప్పటివరకు సుమారు 11 వేలకుపైగా అభ్యంతరకర పోస్టులు, URLలను తొలగించడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా AI ఆధారిత డీప్‌ఫేక్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఈసీ, అలాంటి కంటెంట్‌ను గుర్తించిన 3 గంటల్లోపు తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశించింది. ఎన్నికల నిష్పక్షపాతానికి భంగం కలిగించే సమాచారంపై నిరంతర నిఘా కొనసాగుతోందని స్పష్టం చేసింది.
Latest News