|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 03:03 PM
AP: కర్నూలుకు చెందిన ఎస్‌ఎంఏ టైప్-1తో బాధపడుతున్న పునర్విక అనే చిన్నారికి రూ.16 కోట్ల విలువైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్‌ను వైద్యులు శనివారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో అందించారు. చిన్నారి తల్లిదండ్రుల అభ్యర్థనకు స్పందించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రజల సహకారంతో రూ.10 కోట్లు సేకరించారు. మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని మంత్రి నారా లోకేశ్ ఫిబ్రవరిలో హామీ ఇచ్చారు. ఈ మేరకు విదేశాల నుంచి ఇంజెక్షన్‌ను తెప్పించి, తన సమక్షంలోనే చిన్నారికి అందించారు. తమ పాప ప్రాణాల్ని కాపాడేందుకు సాయం చేసిన మంత్రి లోకేశ్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News