|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 11:17 AM
AP: విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బోనెల శ్రీను, వరలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రేణుక (18)కు ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెకు నిశ్చితార్థం జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నెల 19న బట్టల షాపు ప్రచారం కోసం ఆటోలో కరపత్రాలు పంచారు. తిరిగి ఇంటికి వస్తుండగా.. ఆటోలో నుంచి ప్రమాదవశాత్తూ రేణుక జారి కింద పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందారు.
Latest News