|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 11:36 AM
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలుచోట్ల వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. మండే ఎండల వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చర్మపు బిగుతు, గోరు రంగు, మూత్రం రంగు, నోరు పొడిబారడం, నిలబడగానే తల తిరగడం వంటి లక్షణాలను గమనించాలి. తరచుగా నీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలి. మధ్యాహ్నం ఎండలో తిరగడం తగ్గించాలి. ఇంట్లోనే ORS తయారుచేసుకుని తాగవచ్చు. తీవ్ర లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలి.
Latest News