|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:06 PM
భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ప్రభుత్వం శుభవార్త అందించింది. తాత్కాలిక నివాస, విజిటర్స్, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, విజిటర్ వీసాల ప్రాసెసింగ్ 37 రోజుల నుంచి 23 రోజులకు, స్టడీ పర్మిట్ వీసా 4 వారాల నుంచి 3 వారాలకు, సూపర్ వీసా ప్రాసెసింగ్ 202 రోజుల నుంచి 182 రోజులకు తగ్గింది. ఈ నిర్ణయం భారతీయులకు కెనడా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.
Latest News