|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:37 PM
AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ నాగబాబు 'మాటామంతి' నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించి, దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని సూచించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కార్యకర్తల శ్రమను కొనియాడి, రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
Latest News