|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:34 PM
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అర్చకులు నిబంధనలను ఉల్లంఘించి.. పులివెందులలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి వేదాశీర్వచనం అందించినందుకు గాను టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంతృప్తికరంగా లేని సమాధానం వస్తే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఆలయ పవిత్రత, నిబంధనల కాపాడటంలో అలసత్వాన్ని సహించబోమని టీటీడీ వర్గాలు హెచ్చరించాయి.
Latest News