|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 12:12 PM
తిరుపతి జిల్లాలో తల్లి, భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్న మోహన్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు . ఆన్‌లైన్ రమ్మీకి బానిసగా మారి అప్పుల్లో మునిగిపోవడమే దుర్ఘటనకు కారణమని గుర్తించిన పోలీసులు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణ పాలెం గ్రామం చాకలి వీధిలో తన తల్లి చంద్రకళ(65), భార్య హరిత(33), కొడుకు కౌశిక్(14), కూతురు హరిణి(12)తో కలిసి నివాసం ఉంటున్న మోహన్ అనే వ్యక్తి. తల్లి, భార్యను హత్య చేసిన మోహన్ తాను ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై తల పెట్టగా, తండ్రిని కాపాడే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఇద్దరు పిల్లలు. ఈ కేసు విచారణలో మోహన్ ఆన్‌లైన్ రమ్మీకి బానిసగా మారాడని, రెండు ప్లాట్లు అమ్మేసి, భార్య నగలు తాకట్టు పెట్టి, రూ.20 లక్షల రెండు చీటీలు వేసినా అప్పు తీరకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక నిర్ధారణ. మోహన్ తండ్రి రైల్వే ఉద్యోగి అవడంతో తండ్రి మరణం అనంతరం వచ్చిన రైల్వే ఉద్యోగాన్ని సైతం వదిలేశాడని, అనంతరం భార్య వేసిన చీటి డబ్బులతో సిమెంట్ షాపు పెట్టుకున్నట్లు గుర్తింపు. అయితే మానసిక అనారోగ్యం, సిమెంట్ షాపులో నష్టాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Latest News