|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 01:57 PM
వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, వేసవిలో పిల్లలు ఈత కోసం కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీనివల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి వనరుల వద్ద జారిపడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని, ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
Latest News