|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 02:32 PM
గురుగ్రామ్‌లోని సెక్టార్ 53లో ఉన్న పీజీ ఫ్లాట్‌లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే డ్రగ్స్ తీసుకుని 29 ఏళ్ల రోహిత్ లాల్ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతని రూమ్‌లో లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందులు, హెల్త్ సప్లిమెంట్లు లభ్యమయ్యాయి. కాబోయే భార్యను ఆహ్వానించిన లోపే అతను మృతి చెందాడని, ఓవర్‌డోస్ వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రిపోర్టు వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని, అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Latest News