|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 02:56 PM
ఎమ్మిగనూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో పోలీస్, ఆర్అండ్బి, మున్సిపల్ అధికారులు, టీపీఓలతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేయాలని, ఓం శాంతి సర్కిల్, వ్యవసాయ మార్కెట్ యార్డు, పద్మశ్రీ మచాని సోమప్ప సర్కిల్, శివ సర్కిల్, కర్నూలు బైపాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Latest News