|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 03:12 PM
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా, జడ్పీహెచ్ఎస్ పుట్రెల ఉపాధ్యాయ బృందం కలగర గ్రామంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం', విద్యార్థిమిత్ర కిట్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ విద్యాబోధన, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి సంక్షేమ కార్యక్రమాల గురించి శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రంగ, నాగేంద్ర, శ్రీనివాసరావు, మారేశ్వరి, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Latest News