|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 11:26 AM
తుళ్లూరులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో 28/04/26 నుండి 01/05/26 వరకు స్వామివారి శాంతి కల్యాణం జరగనుంది. ఈ సందర్భంగా, ఆలయ అర్చక స్వామి దిట్టకవి రాజగోపాలచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి పెళ్ళికుమారిని చేయుట, అమ్మవారిని పెళ్లికి కుమార్తెను చేయుట, గరుడ పాట ఆదివాసము మరియు మూలమంత్ర హోమము నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం మూలమంత్ర హోమము, పరిహార కార్యక్రమము, నిత్యం స్వామివారి వివిధ వాహనాలపై గ్రామ ఉత్సవ సేవ నిర్వహించబడుతుంది. కల్యాణం రోజున అన్నదానం కూడా ఉంటుందని వెల్లడించారు.
Latest News