|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 01:38 PM
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్.. దానిని తెరవడానికి అమెరికా విధించిన ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రతలో జోక్యం తగ్గించడం, అణు ఒప్పందంపై చర్చలు వంటి మూడు షరతులను విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రతిపాదించారు. ఈ షరతులు నెరవేరితేనే రవాణా సురక్షితంగా కొనసాగుతుందని, లేదంటే మూసివేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, ఈ షరతులపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Latest News