|
|
by Suryaa Desk | Wed, Apr 29, 2026, 02:21 PM
ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు అనూహ్య నిర్ణయాలతో కోర్టు విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందుకు విచారణకు వెళ్లేది లేదని తేల్చిచెప్పగా, ఇప్పుడు మరో కీలక నేత దుర్గేష్ పాఠక్ కూడా అదే బాట పట్టారు. ఈ మేరకు ఆయన జస్టిస్ స్వర్ణ కాంత శర్మకు ఒక లేఖ రాశారు. 'నేను అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా నిలబడుతున్నాను. ఈ కేసులో నేను హాజరు కాలేను. నా తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టుకు రారు' అని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు.
Latest News