|
|
by Suryaa Desk | Wed, Apr 29, 2026, 03:22 PM
విశాఖపట్నం నుంచి నడికుడికి వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం జరిగింది. 26వ తేదీన రైలులోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న దంపతులను ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి ఒక నిందితుడు తీసుకెళ్లాడు. భర్త టాయిలెట్ వద్ద ఉండగా, నిందితుడు భార్యను ఏసీ కూపేలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రైలు దిగిన తర్వాత భార్య విషయాన్ని భర్తకు చెప్పగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News