|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 09:27 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) టోర్నమెంట్ ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే 40కి పైగా మ్యాచ్‌లు పూర్తవగా, ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమైంది. టాస్ గెలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఆర్సీబీకి ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ రజత్ పాటిదార్ ఔట్ అయిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.అర్షద్ ఖాన్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో పాటిదార్ క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌ను జాసన్ హోల్డర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. అయితే బంతిని నేలకు తగిలించినట్లు కనిపించడంతో ఇది వివాదాస్పద నిర్ణయంగా మారింది. అయినప్పటికీ అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు.ఈ నిర్ణయంపై ఆర్సీబీ డగౌట్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగినట్లు కనిపించింది. బంతి నేలను తాకినప్పటికీ ఔట్ ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.మైదానంలోనే కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో మహేంద్ర సింగ్ ధోని కూడా ఇలాంటి సందర్భాల్లో అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయని అభిమానులు గుర్తుచేస్తున్నారు.చివరికి అంపైర్ల నిర్ణయం మారకపోవడంతో రజత్ పాటిదార్ పెవిలియన్‌కు చేరాడు. అతడు 15 బంతుల్లో 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.ఇప్పటివరకు ఆర్సీబీ 120కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఇప్పటికే ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది.
Latest News