|
|
by Suryaa Desk | Fri, May 01, 2026, 01:55 PM
నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'భారత్ ఫార్మసీ' వెటర్నరీ మెడికల్ షాపును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులకు, పశుపోషకులకు నాణ్యమైన పశువుల మందులు అందుబాటులోకి రావడం హర్షణీయమని ఆయన అన్నారు. పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలని, ఈ ఫార్మసీ ద్వారా మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Latest News