|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 10:57 AM
విజయవాడ గొల్లపూడికి చెందిన 29 ఏళ్ల సాఫ్ట్వేర్ యువతి, భవన్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆరోపించింది. 2018 నుంచి పరిచయం పెంచుకొని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. దీంతో యువతి భవానీపురం పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Latest News