|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 10:42 AM
AP: ప్రకాశం జిల్లా కందుకూరులో డ్రైవర్ అంకయ్య, తనతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియ అనే హిజ్రాను అనుమానంతో గొంతు నులిమి హత్య చేశాడు. గత నెల 27న ప్రియను కందుకూరుకు రప్పించి, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లి, చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులకు అప్పగించి పారిపోయాడు. ప్రియ మెడపై గాయాలను గమనించిన ఆమె తండ్రి ఫిర్యాదుతో పోస్టుమార్టం అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అంకయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు.
Latest News