|
|
by Suryaa Desk | Mon, May 04, 2026, 12:26 PM
గత నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు తమ నియోజకవర్గాల నుంచి వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో షాక్ కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి, తమిళనాడు సీఎం స్టాలిన్ కొళత్తూర్ నుంచి, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా వెనుకంజలో ఉన్నారు. బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, తమిళనాడులో టీవీకే, కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉన్నాయి.
Latest News