|
|
by Suryaa Desk | Mon, May 04, 2026, 12:54 PM
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేలకు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) గట్టి షాక్ ఇచ్చింది. కేవలం రెండేళ్ల క్రితం స్థాపించబడిన టీవీకే, అధికారం దిశగా దూసుకుపోతుండటం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంతో ఏర్పడిన ఖాళీని విజయ్ తన గ్లామర్, అభిమానుల బలంతో పూరించారు. 2024 ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటున్న విజయ్, ఒంటరిగా 234 స్థానాల్లో పోటీ చేసి డీఎంకే కంచుకోటల్లోనూ ఆధిక్యం సాధించడం ఆయన తెగువకు నిదర్శనం.
Latest News