|
|
by Suryaa Desk | Mon, May 04, 2026, 02:09 PM
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ పరిధిలోని వెంగళరావు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి చెట్లు కూలి, విద్యుత్ తీగలు తెగిపోయాయి. సమాచారం అందుకున్న 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు రాత్రి 3 గంటల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల సహకారంతో విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా డివిజన్ అంతటా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Latest News