|
|
by Suryaa Desk | Mon, May 04, 2026, 02:23 PM
AP: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు (2026-29) కొనసాగించేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.
Latest News