by Suryaa Desk | Wed, Sep 18, 2024, 03:39 PM
కీర్తి సురేష్ ప్రధానంగా తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో కథానాయకిగా నటిస్తుంది. తెలుగులో నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆమె ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డు, నాలుగు SIIMA అవార్డులు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్‌తో సహా పలు ప్రశంసలు అందుకుంది. 2021లోఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో కీర్తి స్థానం పొందింది.
కీర్తి సురేష్ 17 అక్టోబర్ 1992న తమిళనాడులోని మద్రాసులో జన్మించింది. ఆమె తండ్రి జి. సురేష్ కుమార్ మలయాళీ మూలానికి చెందిన చిత్రనిర్మాత. ఆమె తల్లి మేనక తమిళ మూలానికి చెందిన నటి. ఆమెకు రేవతి సురేష్ అనే అక్క ఉంది.నాల్గవ తరగతి వరకు, కీర్తి తన పాఠశాల విద్యను తమిళనాడులోని చెన్నైలో చేసింది. తర్వాత కేరళలోని పట్టంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంది. ఆమె ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. లండన్‌లో రెండు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది.తెలుగులో నేను శైలజ చిత్రంతో అరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత నాచురల్ స్టార్ నానికి జోడిగా నేను లోకల్ చిత్రంలో కథానాయకిగా అందం, అభినయంతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.తాజాగా చీర కట్టులో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియా పోస్ట్ చేసిన కీర్తి సురేష్