by Suryaa Desk | Thu, Nov 14, 2024, 04:07 PM
1000 కోట్ల క్లబ్‌లో చేరడానికి తమిళ సినిమా గత కొంత కాలంగా తాపత్రయపడుతూ వుంది. తెలుగులో 'బాహుబలి', కన్నడ నుంచి 'కేజీఎఫ్' సినిమాలతో ఈ ఇండస్ట్రీలు 1000 కోట్ల క్లబ్‌లో మెంబర్స్ అయిపోయాయ్.కానీ, తమిళ సినిమాకి ఇంకా అంతటి భాగ్యం పట్టలేదు. ఆ భాగ్యం సూర్య 'కంగువా'తో దక్కుతుందని ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. మరి, ఆ ఎదురు చూపులు ఫలించాయా.? 'కంగువా'కి అంత సీనుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:ఈ కథ 1000 సంవత్సరాల కాలం నాటిది. అలాగే, ప్రజెంట్‌ని కూడా రిప్రజెంట్ చేస్తూ పాస్ట్‌లో నడుస్తుంటుంది. అలా ఫ్రాన్సిస్ (సూర్య)ని పోలీసులు వెంటాడుతుండడంతో కథ స్టార్ట్ అవుతుంది. గోవాలో బౌంటింగ్ హంటర్‌గా పని చేస్తున్న ఫ్రాన్సిస్.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ చిన్నారిని కలుస్తాడు. ఆ చిన్నారితో తనకు ఏదో సంబంధం వున్నట్లుగా అనిపిస్తుంది. అలా కథ పాస్ట్‌కి వెళుతుంది. పాస్ట్ అంటే 1000 ఏళ్ల గతానికి వెళ్లిపోతుంది. అక్కడ కొన్ని రకాల తెగలు.. వారి సాంప్రదాయాలు, కట్టుబాట్లు.. డిఫరెంట్ టైప్ ఆఫ్ తెగలకు చెందిన డిఫరెంట్ మనుషులు కనిపిస్తుంటారు. అలా ఆ తెగకు చెందిన నాయకుడే కంగువ. మరి, ఆ కాలంలోని కంగువకీ, నేటి కాలంలోని ఫ్రాన్సిస్‌కీ సంబంధం ఏంటీ.? హీరోయిన్ దిశా పటానీతో ఫ్రాన్సిస్ లవ్ ట్రాక్ ఎలా సాగింది.? ఆ చిన్నారితో ఫ్రాన్సిస్‌కి వున్న సంబంధం ఏంటీ.? ఇవన్నీ తెలియాలంటే 'కంగువా' ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
'కంగువ' కోసం సూర్య రెండు రకాల డిఫరెంట్ రోల్స్ పోషించారు. కంగువ పాత్రలో ఆయన ప్రదర్శించిన హావ భావాలు.. ఆకట్టుకుంటాయ్. ఇంతవరకూ సూర్య చేసిన పాత్రలకు భిన్నంగా వుంటుందీ పాత్ర. అలాగే ఫ్రాన్సిస్ రోల్‌లో దాదాపుగా చాలా సినిమాల్లో చూసిందే కానీ, సూర్య ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఇక, సూర్య తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర బాబీ డియోల్. హీరో పాత్ర ఎలివేట్ కావాలంటే విలన్ పాత్రని తీర్చి దిద్దిన విధానం కరెక్ట్‌గా వుండాలి. ఆ విషయంలో బాబీ డియోల్ పాత్రను ఇంకాస్త పవర్ ఫుల్‌గా డిజైన్ చేసి వుండి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. కానీ, వున్నంతవరకూ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు బాబీ డియోల్. తనదైన పర్‌పామెన్స్, మేనరిజమ్, ఫిజిక్‌తో ఆకట్టుకున్నాడు. పిల్లలు, తన తెగ ఆడవాళ్లతో బాబీ డియోల్ చేసే యాక్షన్ ఎపిసోడ్ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటుంది. అలాగే, సూర్యతో యాక్షన్ ఘట్టాల్లో బీభత్సమైన పర్‌పామెన్స్ చూపించాడు. దిశా పటానీ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు కానీ, వున్నంతలో గ్లామర్‌గా కనిపించి ఆకట్టుకుంటుంది. యోగిబాబు వంటి కమెడియన్ వున్నందుకు ఇంకా బాగా వాడుకుని వుండొచ్చు. కానీ, పై పైనే తేల్చేశారు. అక్కడక్కడా తనదైన నటనతో నవ్వులు పూయిస్తాడు యోగిబాబు. మిగిలిన పాత్ర ధారులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు: 'శౌర్యం', '1978' తదితర చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివకి 'కంగువ' చాలా పెద్ద ప్రాజెక్ట్. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. నిర్మాణ విలువలకు ఎక్కడా వంకలు పెట్టడానికి లేదు. అయితే, ఈ తరహా ఫాంటసీ మూవీస్‌కి కథ సిద్ధం చేసుకోవడం బాగానే వుంటుంది కానీ, తెరపై ఆవిష్కరించాల్సి వచ్చేటప్పటికి గట్స్ సరిపోవాలి. గ్రాఫిక్స్ బాగున్నాయ్. అయితే, అక్కడక్కడా కథనాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో శివ తడబడ్డాడు. కథలోని ఎమోషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ కాదు. దాంతో, కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలు సైతం తెరపై అలా వచ్చి పోతుంటాయ్. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేవు. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రెండు కాలాలకు తగ్గట్టుగా వేరియేషన్ బాగా చూపించారు. మాటలు ఓకే. ఎడిటింగ్ కూడా ఓకే. ఇకపోతే, కథనంలో ఇంకాస్త దృష్టి పెట్టి వుంటే బాగుండేది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ నాలుగేళ్ల పాటు కష్టపడి 'కంగువ'ని తాము అనుకున్న రేంజ్‌కి బాగానే తీసుకెళ్లారు. మరి 1000 కోట్ల క్లబ్‌లో చేరడానికి ఆ రేంజ్ సరిపోతుందా.? లేదా.? అనేది చూడాలి మరి.
ప్లస్ పాయింట్స్:
సెకండాఫ్‌లోని బాబీ డియోల్, సూర్య మధ్య వచ్చే పవర్ ఫుల్ సన్నివేశాలు, యాక్షన్ ఘట్టాలు, ముఖ్యంగా మొసలితో సూర్య చేసే యాక్షన్, తెగ ఆడవాళ్లతో, పిల్లలతో బాబీ డియోల్ చేసే యాక్షన్ ఘట్టాలు ఈ సినిమాకి హైలైట్. అలాగే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా సినిమాకి ప్లస్ పాయింటే. గ్రాఫిక్స్..
Latest News