by Suryaa Desk | Fri, Nov 08, 2024, 11:56 AM
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ హాట్ బ్యూటీ దిశా పటానీ.'లోఫర్'మూవీ ఫ్లాపైనా..ఈ సినిమాలో బ్యూటీ గ్లామర్ షోకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఎప్పటికపుడు తన హాట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.2016లో సుశాంత్ సింగ్ హీరోగా ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో ఓ మెయిన్ రోల్ నటించి బాలీవుడ్ లో అడుగుపెట్టింది దిశా పటాని. మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఏడాది ప్రారంభంలో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ'లో ఓ నెగిటివ్ పాత్రలో మెప్పించింది. సినిమాల్లో క్యూట్ క్యూట్ గా నటిస్తూ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటది ప్రముఖ హీరోయిన్ దిశా పటాని.ఇటీవల తెలుగు ఇండియన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడిలో లో గ్లామర్ డాల్ ఒలకబోసే పాత్రలో మెప్పించింది. యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో కూడా ఫస్ట్ ఉంటది ఈ అందాల సుందరి.తాజాగా దిశా పటాని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇన్నర్ వేర్‌తో దర్శనం ఇచ్చి షాకిచ్చింది. గతంలో పలుమార్లు ఇలాంటి డ్రెస్‌తో కనిపించింది. తాజాగా తన ఇన్నర్ వేర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఫోజులు అభి మానులకు మరింత కిక్ ఇచ్చాయి. ఈ ఇన్నర్ వేర్ డ్రెస్ వేసుకుని ఉప్పొంగే ఎద అందాలతో రచ్చ చేసింది. దిశా పటాని ఎద అందాల వడ్డింపుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటాని స్టన్నింగ్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలావుండగా కేవలం బికినీలు, ఫోటోషూట్స్ మాత్రమే కాదు తరచుగా తన రోజువారీ జీవితాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది.
Latest News