రేణుక ఎల్లమ్మ అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ 48వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం ఆయన అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు హరీశ్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa