వనపర్తి జిల్లా & మండలం చిమనగుంటపల్లి గ్రామ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి స్వామివారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి రథం ఏర్పాటు చేసేందుకు సహకరించిన గ్రామస్తులను ఆయన శాలువాలతో సత్కరించారు. భక్తులతో కలిసి ఎమ్మెల్యే స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa